ఆగ్రోస్ అవుట్ లెట్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి..

44
Minister Errabelli

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆగ్రోస్ సంస్థ ద్వారా అందిస్తున్న తెలంగాణ సిరి సిటీ కాంపోస్ట్‌ను రైతులు విరివిగా ఉపయోగించుకోవాల‌ని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుల‌కు పిలుపునిచ్చారు. కుళ్ళిపోయిన కూర‌గాయ‌లు, ఇత‌ర వ్య‌ర్థాల‌తో త‌యార‌య్యే ఈ ఎరువుల వ‌ల్ల అధిక దిగుబడులు వ‌స్తాయ‌ని మంత్రి అన్నారు. దేవ‌రుప్పుల మండ‌లం సింగ‌రాజుప‌ల్లిలో ప్ర‌భుత్వ ఆగ్రోస్ అవుట్ లెట్‌ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. రైతుల‌కు 50శాతం స‌బ్సిడీపై ఇస్తున్న సేంద్రీయ ఎరువుల‌ను మంత్రి రైతుల‌కు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, రైతులు పాల్గొన్నారు.