పాతనగర అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఏత్తున చేపడుతున్నదని పురపాలక శాఖ మంత్రి కెటి రామరావు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ హాళ్ల పాత నగర యంఏల్యేలతో మంత్రి ఒక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా అక్కడ చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల పురోగతిపైన మంత్రి సమీక్షించారు. హైదరాబాద్ నగరానికి చారిత్రక చిహ్నమైన చార్మినార్ ను సంరక్షించేందుకు చేపట్టిన చార్మినార్ పెడెస్ర్టియ్ ప్రాజెక్టుపైన ఈ సమావేశంలో ప్రత్యకంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చార్మినార్ కు సందర్శకుల సంఖ్య పెద్ద ఏత్తున పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పౌర సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
టాయ్ లెట్లు, వాటర్ కియోస్కులు, మహిళలకోసం ప్రత్యేకంగా షీటాయ్ లెట్లు, పార్కింగ్ సదుపాయాల కల్పన వేంటనే చేపట్టాలన్నారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు అక్కడి వీధుల్లో చేపట్టాల్సిన (ఫాసాడ్ డెవలప్ మెంట్) పైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఫాసడ్ అభివృద్ది కోసం రూపొందించిన పలు డిజైన్లు పరిశీలించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు జియచ్ యంసిలోని ఒక ఐఏయస్ అధికారి అధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చార్మినార్ కున్న ద్వారాల మాదిరి డిజైన్లను అక్కడి వీధుల డెవలప్ మెంట్( ఫాసడ్) లోనే ఉపయోగించుకున్నట్లు డిజైనర్లు సమావేశంలోని ప్రజా ప్రతినిధులకు తెలిపారు. ఈ ఫాసాడ్ డెవలప్ మెంట్ ద్వారా వీధుల్లోని, దుకాణాలు, సైన్ బోర్డుల్లో ఏకరూపకత తీసుకోచ్చేందుకు వీలుకలుగుతుందన్నారు. పాతనగరంలో చేపట్టే ప్రతి అభివృద్ది పనుల్లో చారిత్రక డెక్కన్ అర్కిటెక్టర్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలకు డిజైన్లు తయారు చేయాలన్నారు. ముఖ్యంగా త్వరలో చేపట్టనున్న మూసీ నది సుందరీకరణ, అభివృద్ది ప్రణాళికల్లో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులను అదేశించారు. మూసీపైన నిర్మించనున్న బ్రిడ్జిలపైన నయాపూల్ బ్రిడ్జి మాదిరి డైజైన్లు చేయాలన్నారు.
పాతనగరంలోని రోడ్ల అభివృద్ది, జలమండలి పనులు, డబుల్ బెడరూం ఇళ్లు నిర్మాణాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. జలమండలి ద్వారా రానున్న వేసవి కాలం కోసం కనీసం 5 యంజిడి నీటిని అధనంగా సరఫరా చేయాలని యంఏల్యేలు మంత్రిని కోరారు. ఈమేరకు జలమండలి అధికారులను మంత్రి అదనపు సరఫరా కోసం అదేశించారు. మోజాం జాహీ మార్కెట్ అభివృద్ది చేసే కార్యక్రమాన్ని పురపాలక శాఖ ముఖ్యకారదర్శి అరవింద్ కూమార్ కు ప్రత్యేకంగా తీసుకోవాలని మంత్రి కోరారు. దీంతోపాటు తక్కువ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలకు టియూయఫ్ ఐడిసి కార్పోరేషన్ ద్వారా నిధులు ఇస్తామని మంత్రి తెలిపారు.
పాతనగరానికి మెట్రో కనెక్టివిటీ పైన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు మంత్రితో చర్చించారు. పాతనగరంలో వేంటనే మెట్రో పనుల ప్రారంభించాలని కోరారు. పాతనగరంలో ప్రభుత్వం మెట్రోని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నదని మంత్రి తెలిపారు. దీంతోపాటు నాగోల్ నుంచి ఫలక్ నుమా వరకు, ఫలక్ నుమా నుంచి ఏయిర్ పొర్ట్ వరకు మెట్రో మార్గాలను భవిష్యత్తు ప్రణాళికల్లో ఉంచాలని వారు మంత్రిని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా హమీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఏంఐయం యంఏల్యేలు, జియచ్ యంసి, మెట్రోరైల్, వాటర్ వర్క్స్ విభాగాల అధికారులు పాల్గోన్నారు.