కొడంగల్‌లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ..

30
- Advertisement -

తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకానుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఈ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-2025 విద్యా సంవత్సరం నుంచే కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో 3 బీటెక్‌ బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్‌), సీఎస్‌ఈ (డేటా సైన్స్‌) 3 కోర్సులు అందుబాటులోకి రానుండగా ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు ఈ కాలేజీలో ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల మాత్రం తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కాలేజీలో మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వారి వేతనాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలను సాంకేతిక విద్యాశాఖ చేపట్టనుంది.

Also Read:చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

- Advertisement -