నేడు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం ప్రారంభించారు. ఈ ప్రసంగంలో దేశంలోనే నవ రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. నూతన రాష్ట్రమైన తెలంగాణ తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉభయసభల్లో చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాని చెప్పారు.
అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానాన్ని సాధించామని తెలిపారు. ప్రభుత్వం సులభతర వాణిజ్యం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రం 13.2 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపారు. సేవా రంగం 14.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి 17.2 శాతంగా ఉందని తెలిపారు.