రంజాన్ మాసం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహిన్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి పలువురు పాల్గోన్నారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అతీతో పాటు పలువురు ముస్లింలకు సీఎం కేసీఆర్ పండ్లు తినిపించారు.
ఈసందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ..రంజాన్ పండుగ మానవత్వానికి, త్యాగానికి ప్రతీక అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఆకలి బాధను తెలిపి సహనాన్ని పెంచుతాయన్నారు. అన్ని సంపదల కంటే మానవత్వం, మంచితనమే గొప్పవన్నారు. రంజాన్ పరమార్ధం కూడా అదేనన్నారు. అల్లా దయతో రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలన్నారు. హిందువులు ముస్లింలు ఐకమత్యంగా ఉండాలని సూచించారు.
ఈసందర్భంగా పలువురు ముస్లింలకు పండ్లు తినిపించారు గవర్నర్ నరసింహన్. ఇఫ్తార్ విందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, ఎంపీలు వినోద్‌కుమార్, మల్లారెడ్డి, సంతోష్‌కుమార్ పలువురు పాల్గోన్నారు.