మ్యాంగో ఆఫీసు వద్ద గౌడ కులస్తుల నిరసన..

94
- Advertisement -

గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలను కించపరిచే విధంగా ప్రసారం చేసిన మ్యాంగో ఛానల్ కార్యాలయం వద్ద గౌడ కులస్తులు నిరసన చేసేందుకు యత్నించారు. గౌడ నాయకులు సిద్ధార్థ నేతృత్వంలోని సుమారు 20 మంది బృందం గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలి, మ్యాంగో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలను కించపరుస్తూ ప్రసారం చేస్తున్న వీడియోలను డిలీట్ చేయాలని, అదేవిధంగా కులస్తులకు క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం విచారకరమని సిద్ధార్థ ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ జాతిని కించపరిచిన ఛానల్ యాజమాన్యాన్ని వదిలి తమను అకారణంగా అరెస్టు చేయడం ఏమిటంటే మండిపడ్డారు.

- Advertisement -