రాజ‌ప‌క్స రాజీనామా.. శ్రీ‌లంక‌లో సంబ‌రాలు

87
rajapakse
- Advertisement -

శ్రీలంక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎట్టకేలకు శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో ప్రజలు పండగ చేసుకున్నారు. శ్రీ‌లంక పార్లమెంట్ స్పీక‌ర్‌కు ఆయ‌న రాజీనామా లేఖ పంపారు. రాజపక్స రాజీనామాతో ప్రజలు బాణ‌సంచా కాల్చుతూ డ్యాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే కొనసాగుతున్నారు. దేశ వ్యాప్తంగా చెలరేగుతోన్న ఆందోళనలను అణచివేయాలని ఆయన ఇప్పటికే శ్రీలంక సైన్యాన్ని ఆదేశించారు.

శ్రీలంక ఆర్థిక పరిస్థితి విషమించడంతో మొద‌ట శ్రీ‌లంక నుంచి మాల్దీవుల‌కు పారిపోయిన గొట‌బాయ రాజ‌ప‌క్స, అక్క‌డి నుంచి సింగ‌పూర్‌కు చేరుకున్నారు.
మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం-ఎస్వీ 788లో రాజ‌ప‌క్స సింగ‌పూర్ చాంగీ విమానాశ్ర‌యం చేరుకుని అక్క‌డి నుంచి ఓ హోట‌ల్‌కు వెళ్ళిన‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -