వీర్య వృద్దిని పెంచే ‘గొరక్షాసనం’!

163
- Advertisement -

నేటి రోజుల్లో పురుషులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య సంతనలేమి.. మారుతున్న ఆహారపు అలవాట్లు లేదా విపరీతమైన పని ఒత్తిడి వంటి కారణాల వల్ల పురుషుల్లో వీర్య కణాల ఒత్తిడి తగ్గిపోవడంతో చాలామంది పురుషులు శృంగార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు బయటకి చెప్పేవి కాకపోవడంతో తమలో తామే మదనపడుతుంటారు. అయితే ఇలాంటి శృంగార సమస్యలకు సరైన వైద్యం ద్వారా పరిష్కారం లభిస్తుంది అయితే వైద్యుడిని సంప్రదించడానికి కూడా చాలామంది మొహమాట పడుతూ ఉంటారు. అయితే పురుషుల్లో ఏర్పడే ఎలాంటి శృంగార సమస్యలకైనా యోగా లో గొరక్షాసనం ద్వారా చెక్ పెట్టవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ గొరక్షాసనం ప్రతిరోజూ వేయడం వల్ల పురుషుల్లో వీర్య కణాల వృద్ది పెరుగుతుందట. అంతే కాకుండా పురుషుల్లో సహజంగా వచ్చే అంగస్తంబన, శీఘ్రస్కలనం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయట. ఇక సంతానలోపం ఉన్న పురుషులు ఈ ఆసనం వేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇక స్త్రీలలో కూడా ఈ ఆసనం ద్వారా గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయట. అంతే కాకుండా గొరక్షాసనం ద్వారా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట.

గొరక్షాసనం వేయు విధానం

ముందుగా నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత రెండు చేతులను మోకళ్లపై ఉంచాలి. ఇలా చేసిన తరువాత పాదాలను రెండిటినీ దగ్గరకు తెచ్చి ఒకదానికొకటి అతికించినట్లుగా ఉంచాలి. తరువాత రెండు చేతులను మోకాళ్ళ మీద నుంచి తీసి కుడి చేత్తో ఎడమ మడమను, ఎడమ చేత్తో కుడి మడమను పైన చిత్రంలో చూపిన విధంగా పట్టుకోవాలి. తరువాత శ్వాస క్రియ సాధారణ స్థితిలో చేయాలి. ఇలా ప్రతిరోజూ 10-15 నిముషాల పాటు ఈ ఆసనం చేయాలి.

గమనిక : గొరక్షాసనం వేయడం వల్ల కడుపు భాగం నుంచి అరికాలు వరకు అధిక ప్రభావం ఉంటుంది. అందువల్ల మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు లేదా పేగుల్లో ఆయా రకాల సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:పుష్ప 2..సాంగ్ ప్రొమో అదుర్స్

- Advertisement -