- Advertisement -
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను ఇటివలే పూర్తి చేసుకుంది.
మూవీ మేకర్స్ పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
- Advertisement -