ప్ర‌భాస్ కోసం ఏమైనా చేస్తా: గోపిచంద్

48
gopichand prabhas
- Advertisement -

వైవిధ్య‌మైన సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ హీరో గోపిచంద్. అయితే ఇటీవ‌లి కాలంలో ఆయ‌న న‌టించిన సినిమాలు పెద్దగా స‌క్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు గోపిచంద్. ఈ సినిమా జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకురానుండ‌గా సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కెరీర్ తొలినాళ్ల‌లో విల‌న్‌గా న‌టించిన గోపిచంద్‌ను “మ‌ళ్లీ మీరు విల‌న్‌గా వ‌స్తారా?” అని అడ‌గ్గా ప్ర‌భాస్‌తో అయితే చేస్తాన‌ని తెలిపారు. క్యారెక్ట‌ర్ అంతా ఏమి చూసుకోను, ప్ర‌భాస్ అడిగితే ఏ క్యారెక్ట‌ర్ అయినా చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌భాస్‌తో త‌న‌కు మంచి సాన్నిహిత్యం ఉంద‌ని…ఇండ‌స్ట్రీలో త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు.

ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న రాశీఖన్నా హీరోయిన్‌గా న‌టించింది. స‌త్య‌రాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, అన‌సూయ‌, రావుర‌మేష్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 26న జ‌రుగనుండ‌గా ఆ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు.

- Advertisement -