ఆ దర్శకుడిపైనే భారం వేసిన గోపిచంద్..!

348
gopichand hero
- Advertisement -

లౌక్యం తర్వాత హీరో గోపిచంద్ కు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. గౌతమ్ నంద, ఆక్సిజన్,రీసెంట్‌గా పంతం సినిమాలు అశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా చేయ్యాలని చూస్తున్నారు. అందుకు దగ్గట్టుగా చక్రి దర్శకత్వంలో ఓ …దీంతో తనకు రెండు బ్లాక్ బస్టర్ హిట్‌లు ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్‌పైనే నమ్మకం పెట్టుకున్నాడు గోపిచంద్.

హీరో గోపి చంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన లౌక్యం, లక్ష్యం సూపర్ హిట్ సాధించాయి. దీంతో మరోసారి ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ‘పంతం’ తో నిరాశపడ్డ గోపిచంద్ ఈ సారి ఎలాగైన హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Image result for gopichand srivas

గోపిచంద్‌తో చేయబోయే సినిమా శ్రీవాస్‌కు కూడా కీలకం కానుంది. ఇటీవల ‘సాక్ష్యం’ తో పరాజయాన్ని చవి చూశాడు శ్రీవాస్.దీంతో గోపిచంద్‌తో తీయబోయే సినిమాతో హిట్ కొట్టేందుకు కథను సిద్ధం చేస్తున్నారు. మరి ఈచిత్రం వీరికి హ్యాట్రిక్ విజయాలను అందించి మళ్లీ వీరిద్దర్నీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -