‘చాణ‌క్య‌’.. సరికొత్త లుక్‌లో గోపీచంద్‌..!

344
Gopichand
- Advertisement -

హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్`చాణ‌క్య‌`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్  వ‌చ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుద‌ల చేశారు.

గోపీచంద్‌తో మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మూడు పాట‌లు మాత్ర‌మే మిగిలి ఉంటాయి. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Gopichand

న‌టీన‌టులు:గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌రీనా ఖాన్ త‌దిత‌రులు.. సాంకేతిక నిపుణులు:క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తిరు,నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌,బ్యాన‌ర్‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌,, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి,కో ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, మ్యూజిక్‌: విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌,సినిమాటోగ్ర‌ఫీ: వెట్రీ ప‌ళ‌ని స్వామి,మాట‌లు: అబ్బూరి ర‌వి,ఆర్ట్‌: ర‌మ‌ణ వంకా,కోడైరెక్ట‌ర్‌: దాసం సాయి, రాజ్‌మోహ‌న్‌,పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌.

- Advertisement -