విశ్వం..గోపీచంద్ బర్త్‌డే స్పెషల్

4
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. షేడ్స్, క్యాప్ తో, ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న గోపీచంద్ పోస్టర్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

దర్శకుడు శ్రీను వైట్ల తన హీరోలను స్టైలిష్ బెస్ట్ అవతార్‌లలో ప్రజెంట్ చేయడంలో స్పెషలిస్ట్, విశ్వం కోసం మేకోవర్ అయిన గోపీచంద్ పోస్టర్‌లో లైట్ గడ్డంతో అల్ట్రా-మోడిష్‌గా కనిపించారు.

Also Read:చర్మ సమస్యలకు వీటితో చెక్..

మేకర్స్ ఫస్ట్ స్ట్రైక్ వీడియోతో ఈద్ సందర్భంగా మాస్ ఫీస్ట్ ని అందించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.విశ్వం సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

- Advertisement -