Gopichand:భీమా అప్‌డేట్

70
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’ నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటెన్స్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. గోపీచంద్ ఖాకీ దుస్తుల్లో ఫెరోషియస్ గా కనిపించారు. సినిమాలో పవర్ ఫుల్ పోలీసు పాత్ర పోషిస్తున్న గోపీచంద్ పోస్టర్ లో చేతిలో సంకెళ్ళు పట్టుకొని టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ పోస్టర్ సినిమాలో గోపీచంద్ వైల్డ్ నేచర్ ని తెలియజేస్తోంది.

హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:BRS:బి‌ఆర్‌ఎస్ ముందు బిగ్ టాస్క్?

- Advertisement -