కేరళకు..గూగుల్‌ రూ.7 కోట్లు..!

211
Google
- Advertisement -

సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ ఇప్పుడు కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారీ వరదలతో కేరళ రాష్ట్రం అతలకుతలం అయిన విషయం తెలిసిందే.

కేరళ బాధితులను ఆదుకునేందుకు తమకు తోచిన సాయాన్ని అందించడానికి ప్రముఖకంపెనీలు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గూగుల్‌ సంస్థ తరఫున మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) విరాళంగా ఇవ్వనున్నట్లు గూగుల్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.

Kerala Flood

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న ఆ సంస్థ ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ..గూగుల్,ఓఆర్‌జీ, గూగులర్స్ కలిసి కేరళ సహాయక చర్యల కోసం మిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.

కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ పలు రకాల చర్యలను చేపట్టింది. అందులో భాగంగా కేరళలో పర్సన్ ఫైండర్ టూల్‌ను యాక్టివేట్ చేసింది. దీనిద్వారా 22 వేల మంది సమాచారం తెలిసింది.

- Advertisement -