- Advertisement -
గూగుల్ మ్యాప్ ఇకపై స్ట్రీట్ వ్యూ సదుపాయాన్ని కల్పించనుంది. హైదరాబాద్ సహా దేశంలోని 10 నగరాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించింది. దీంతో రోడ్లు, దుకాణాలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు వంటి వాటిని మరింత స్పష్టంగా చూసే అవకాశం కల్పించింది గూగుల్.
భద్రతాపర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో స్ట్రీట్ వ్యూ సేవలను కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ క్రితం బ్యాన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ సేవలకు అనుమతి లభించడంతో గూగుల్ మ్యాప్స్ ఈ సేవలను ప్రారంభించింది.
హైదరాబాద్‌తో పాటు అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, నాసిక్, పుణే, వడదోరా, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వీధులు, రోడ్లు, పర్యాటక ప్రదేశాలు, కొండలు, నదుల వంటివి 360 డిగ్రీల కోణంలోనూ చూడొచ్చు.
- Advertisement -