హైదరాబాద్‌ను సేఫ్టీ ఇంజనీరింగ్ & సైబర్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్‌గా మార్చడానికి పునాదిని పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో చర్చలు జరిపారు గూగుల్ కంపెనీ ప్రతినిధులు.
ఈ సందర్భంగా భారీ పెట్టుబడులకు సిద్ధమని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 2024లో గూగుల్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు. గూగుల్ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.
ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకానుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read:Modi 3.0: అన్ని సంచలన నిర్ణయాలే!