- Advertisement -
లే ఆఫ్ ఎఫెక్ట్‌తో గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీమ్ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్ తాజాగా సుమారు 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్‌లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు తెలుస్తోంది.
ఇందులో కాలిఫోర్నియా, సన్నీవేల్‌లోని ఆఫీసుల్లోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపింది. ఇప్పటికే పైథాన్, ఫ్లుట్టర్, డార్ట్‌లపై పనిచేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను గూగుల్ కంపెనీ తొలగించింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గజాలైన గూగుల్‌తోపాటు అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు ఉన్నాయి.
Also Read;ఈ ఆసనాలతో గుండెపోటు కు చెక్..!
- Advertisement -