గూఢచారి సెన్సార్ పూర్తి..

264
Goodachari censor
- Advertisement -

అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం గూఢచారి. ఆగస్టు 3న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సినిమా చిత్రీకరణ అధికభాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పూణే, న్యూ ఢిల్లీ, చిట్టిగాంగ్ హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రేదేశాల్లో జరిగింది. గూడాచారి సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైటెక్నీకల్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. ఇటీవల విడుదల ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా సుప్రియ యార్లగడ్డ వెండితెరపై రీ ఎంట్రి ఇవ్వబోతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించగా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,విస్టా డ్రీమ్ మర్చెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

నటీనటులు: అడవిశేష్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ..సాంకేతిక నిపుణులు: డైరెక్టర్: శశికిరణ్ తిక్కా,స్టోరి: అడవి శేష్,మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల,డైలాగ్స్: అబ్బూరి రవి,సినిమాటోగ్రఫి: షనీల్ డియో,ఎడిటర్: గ్యారీ బి.హెచ్,ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావ్,పి. ఆర్.ఓ.: వంశీ – శేఖర్.

- Advertisement -