దేశవ్యాప్తంగా ఉద్యమంలా.. సంతన్న ‘గ్రీన్ ఛాలెంజ్’..

480
mp santhosh
- Advertisement -

భారతదేశం పచ్చగా కళకళలాడాలన్న ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఛాలెంజ్’ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మొక్కలు నాటిన ఒక వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో, ఆ ముగ్గురు మరో ముగ్గురితో.. ఇలా మొక్కలు నాటించేందుకు కృషి చేయాలి. ఈ ఛాలెంజ్‌లో ఎంతో మంది సినీ,రాజకీయ, వ్యాపార,క్రీడాకారులు పాల్గొని తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు.

mp-santhosh

ఈ కార్యక్రమంలో ఇప్పటికే మూడు కోట్ల పైన మొక్కలు నాటడం జరిగింది. ఇది ఇలాగే ఓ ఉద్యమంలో కొనసాగుతూనే ఉంది. 10 కొట్ల మొక్కలు నాటే దిశగా ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లుత్తున్నారు. ఇంత గొప్ప సంకల్పన్ని ముందుకు తీసుకొచ్చిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కమార్‌కు దేశ నలుమూలల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది.

కాగా ఈ కార్యక్రమంలో ఎవరైతే నాటిన మొక్కలను ఎక్కువగా సంరక్షిస్తారో వారికి మాజీ రాష్ట్రపతి ‘డా. ఏపీజే అబ్దుల్ కలాం వనమిత్ర’ అవార్డుతో సత్కరిస్తామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపిన విషయం తెలిసిందే.

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ గురించి మరిన్ని విషయాలు..

- Advertisement -