రాబోయే తరానికి గ్రీన్ ఛాలెంజ్ ఆదర్శం కావాలి..

53
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తమ కూతురు మరియు అల్లుడు సత్యమురళీ ఇచ్చిన పిలుపుకు స్పందించి రిటైడ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ( అగ్రికల్చర్‌ డిపాట్మెంట్‌ ) గోపాల రత్నం మరియు సబిత దంపతులు తమ 50వ పెళ్లిరోజు సందర్భంగా తమ కుమారులు, కోడళ్లు మనమలతో కలిసి మామిడి మరియు నిమ్మ చెట్లను నాటారు. తమ అల్లుడి మిత్రుడు రాఘవ స్పూర్తితో నిజామాబాద్ లోని తమ నివాసంలో మొక్కలు నాటి ప్రకృతి పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు గోపాల రత్నం దంపతులు.

ఈ సందర్భంగా గోపాల్ రత్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరుగున పడిన సంస్కృతిని హరితహరం ద్వారా మళ్లీ ప్రారంభించి ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ ఎంతో మందిని ప్రభావితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు మా పెళ్లిరోజు సందర్భంగా చెట్లు నాటడం చాలా సంతోషాన్నికలిగించిందని, కరొనా కష్ట కాలంలో ఆక్సీజన్‌ అందక సతమతమవుతున్న ఈ తరుణంలో ఎంపీ సంతోష్ కుమార్ చెప్పినట్లు జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సంతోష క్షణాన్ని మొక్క నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో అందరూ భాగస్వాములు కావాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మనకు శ్రీ రామ రక్ష అని పేర్కొన్నారు.

ఇదే విధంగా భావితరానికి మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం అనేది ఒక ఆచారంగా మార్చి, రాబోయే తరానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆదర్శం కావాలని కోరుకుంటు ఇంతటి బృహత్ కార్యక్రమంలో మా దంపతులు పాల్గొనడం సంతోషంగా ఉందని, ఎంపీ సంతోష్ కుమార్ గారికి ఆ భగవంతుడు ఇంకా శక్తిని ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించి ముందు తరాలకు ఆదర్శంగా నిలబడాలని కోరారు.