ఇంటింట చెట్లు ఊరూరా వనం ! మేము సైతం అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా కొండపలకల గ్రామం నేను చదివిన ఉన్నత పాఠశాలలో “హెడ్ మాస్టర్” మందల రాజిరెడ్డి చేతుల మీదచెట్ల నాటడం జరిగింది. స్కూల్ టీచర్స్… సుధాకర్, సత్యనారాయణరెడ్డి, అపర్ణ, శ్రీలత, అబ్దుల్, నయన్, శంకర్ , రామచందర్ రెడ్డి , రఘు రవీందర్ ,విజయకుమార్ చతరాజు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా రామాలయం గుడి ఆవరణంలో గ్రామ కార్యదరిశి దిడ్డి ప్రశాంత్ ఆలయ పూజారి చెట్లు నాటారు. సిఎం కేసిఆర్ మానస పుత్రికైన తెలంగాణకు హరితహారం స్పూర్తితో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పర్యావరణ సమతుల్యత జరగాంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే ఉద్దేశ్యం మహా గొప్పదని, గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

