Ind Vs SA:హాట్‌ కేకుల్లా విశాఖ వన్డే టికెట్లు

4
- Advertisement -

విశాఖలో జరగనున్న భారత్–దక్షిణాఫ్రికా మూడో వన్డే మ్యాచ్‌ టికెట్ల విక్రయం హాట్‌ కేకుల్లా సాగుతోంది. ప్రారంభ దశలో పెద్దగా స్పందన కనిపించనప్పటికీ, కోహ్లీ ఫానిజం ఒక్కసారిగా టికెట్ల డిమాండ్‌ను భారీగా పెంచింది. నవంబర్‌ 28 వరకు జరిగిన తొలి విడత ఆన్‌లైన్‌ టికెట్‌ అమ్మకాలలో నిరీక్షించినంత రిస్పాన్స్‌ లేకపోయినా, నవంబర్‌ 30న రాంచీలో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత శతకం చేశాక పరిస్థితి మారిపోయింది.

తదుపరి రెండో వన్డేలో రాయ్‌పూర్‌లో కోహ్లీ మరోసారి 102 పరుగులతో రాణించడంతో, విశాఖలో జరగనున్న మ్యాచ్‌పై క్రేజ్ మరింత పెరిగింది. అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ పోర్టల్స్‌లో కూడా ట్రాఫిక్ పెరిగి, కొన్ని కేటగిరీల టికెట్లు గంటల్లోనే సేల్‌ అవుతున్నాయి.

విశాఖతో కోహ్లీకి ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా ఈ డిమాండ్‌ పెరగడానికి మరో ప్రధాన కారణం. ఇప్పటి వరకు విశాఖలో ఆడిన ఏడు వన్డేల్లో కోహ్లీ మొత్తం 587 పరుగులు చేశారు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉండటం విశేషం. దీంతో కోహ్లీ మరోసారి విశాఖ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక ఇన్నింగ్స్‌ ఆడతాడనే నమ్మకంతో అభిమానులు భారీగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. మొత్తానికి, విశాఖ వన్డే మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.

Also Read:లండన్‌కు బంగ్లామాజీ ప్రధాని ఖలీదా

- Advertisement -