సత్ఫలితాన్నిస్తున్న గ్రీన్ ఛాలెంజ్..

7
- Advertisement -

నార్త్ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ కరోల్ బాగ్ జోన్‌ నరైన్ ఇండస్ట్రియల్ ఏరియాలో 02.07.2022న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మియవాకి ప్లాంటేషన్ అద్భుత ఫలితాలనిస్తుంది.

నాడు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ పై ఎక్స్ వేదికగా పంచుకున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్.

ఢిల్లీలో లక్ష మొక్కలు నాటాలని సంకల్పంతో నాడు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా నేడు పచ్చని అడవిగా మారింది.కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి ఇది కొత్త ఊపిరినిస్తుంది.ఈ అద్భుతమైన గ్రినరీని చూస్తుంటే సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు సంతోష్ కుమార్.

Also Read:లక్ష్మారెడ్డి సతీమణి మృతి.. హరీశ్‌ రావు నివాళి

- Advertisement -