- Advertisement -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం పడనుంది.
మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో అద్దె ప్రాతిపదికన 150 బస్సులు నడవనున్నాయి.
తరువాత దశలో ఆర్టీసీలోకి 450 బస్సులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రేపు మహిళా శక్తి బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Also Read:ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్
- Advertisement -