నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 1433 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..

64
jobs
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్‌లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసింది. 657 ఏఈఈ, 113 ఏఈ సహా ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్‌వో ఇతర పోస్టుల భర్తీకీ అనుమతి ఇచ్చారు.

ఇక తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింన కేసీఆర్ సర్కార్ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు, 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది.

- Advertisement -