Prabhas:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

64
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్ పార్ట్ 1’ ఈనెల 22న విడుదల కానుంది. ఈ క్రమంలో సలార్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్‌ న్యూస్ చెప్పారు. ఈ రోజు రాత్రి 8.24 గంటల నుంచి సలార్ నైజాం టికెట్ల బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేశారు. కాగా, సలార్ తెలంగాణ, నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో స్పెషల్ (6 షోలు) షోలకు అనుమతిని ఇచ్చారు. అలాగే, కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్స్‌లో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు.

ఇక తెలంగాణలో టికెట్ల ధర, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 250, రూ.175, రూ.100, మల్టీఫెక్స్‌ల్లో రూ.370, రూ. 470. సాధారణ టికెట్ రేట్లుతో పోలిస్తే మల్టీఫెక్స్‌ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచనున్నారు. అన్నట్టు సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40లు పెంచుకునేందుకు స‌లార్ నిర్మాత‌ల‌కు అనుమతి ల‌భించింది. అయితే, ఈ ధ‌ర‌ల‌ పెంపు నిర్ణ‌యం10 రోజులు మాత్ర‌మే అమ‌ల్లో ఉండ‌నుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. మొత్తానికి ఆంధ్రలో ‘సలార్’ స్పెషల్ షోలకు పర్మిషన్ దక్కడం పై ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

కాగా ఈ మూవీ విడుదలకు ముందే సరికొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాను చూసేందుకు 1 మిలియన్‌కి పైగా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ఇప్పటికే వెల్లడించింది. మొత్తానికి స‌లార్ మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరి సలార్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ఎలాగూ కిస్మస్ సెలవులు ఉన్నాయి కాబట్టి, ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టడం ఖాయం అంటున్నారు.

Also Read:ఆ సినీ రచయిత మాట నేటికీ గొప్పదే

- Advertisement -