తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని గౌరవ వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు తెలియజేసారు.
గత సంవత్సరం ఫిబ్రవరిలో టన్నుకి ఆయిల్ పామ్ గెలల ధర రూ13135/- ఉండగా ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధర రూ20871/- పెరగడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రివర్యులు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్ పామ్ సాగును లాభ సాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రివర్యులు పేర్కొన్నారు.
ఆయిల్ ఫెడ్ వారి ప్రోసెసింగ్ మిల్లులలో నూనె రికవరీ శాతం మరియు ముడి పామాయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయించడం జరుగుతుంది. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా నడపబడుతున్న అప్పరావ్ పేట మరియు అశ్వరావుపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాలలో నూతన టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయడం మరియు ఉన్న యంత్రాలను అధునికరించడం వల్ల ఆయిల్ పామ్ గెలల నుండి వచ్చే నూనె రికవరీ శాతం (OER) టన్నుకు 19.02 శాతం నుండి 19.42 శాతముకు పెరగడం వల్ల టన్నుకు ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రివర్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్ పామ్ గెలల ధరను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వాల్సిరావడంతో అక్కడ పామ్ ఆయిల్ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీలు కొంత మంది బ్రోకర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆయిల్ ఫెడ్ రైతుల సంక్షేమం కోసం పని చేస్తూ నూనె రికవరీ శాతం పెంచుతూ ఆయిల్ పామ్ రైతుల మన్నలను అందుకుంటున్నదని మంత్రివర్యులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటి వరకు 2.39 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగిందని, వచ్చే సంవత్సరంలో మరో లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని మంత్రివర్యులు పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించెందుకు ఏకరాకు రూ 50918/- రాయితిని నాలుగు సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతున్నదని, రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని మంత్రి వర్యులు కోరారు.
Also Read:వేరుశెనగలతో అద్భుత ప్రయోజనాలు