ఇక‌పై గంట‌లోపే శ్రీ‌వారి స‌ర్వ‌ద‌ర్శ‌నం

34
ttd lord balaji darshanam
- Advertisement -

టీటీడీలో ఇప్ప‌టికే భారీ ప్ర‌క్షాళ‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌గా తాజాగా మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. భ‌క్తుల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త ఇక‌పై పెంచుతామ‌ని ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. అంతేగాదు ఇక‌పై శ్రీ‌వారి స‌ర్వ‌ద‌ర్శ‌నం గంట‌ల‌లోపే అయ్యేలా మార్పులు చేస్తున్నామ‌ని చెప్పారు.

తిరుప‌తిలో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను రూపు మాపామ‌ని ఇప్పటి వరకు 216 బైండోవర్‌ కేసులు పెట్టి.. 1,377 మందిని తిరుమల కొండకు రానివ్వలేద‌న్నారు. ఇక‌పై ఆన్‌లైన్‌ ద్వారా దర్శనంతో పాటు వివిధ సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్‌ మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనం సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో రూ.1,500 కోట్ల విరాళాలు వచ్చాయని, హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు వెల్ల‌డించారు.

- Advertisement -