క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్..

43
- Advertisement -

క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి హరీశ్ రావు. త్వరలోనే జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని చెప్పారు హరీశ్. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి నూతన ఆంకాలజీ బ్లాక్‌ను ప్రారంభించి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.దేశంలోనే ప్రభుత్వ రంగంలో కాన్సర్ చికిత్సకు రెండో అతిపెద్ద ఆస్పత్రిగా ఎంఎన్‌జే నిలిచిందన్నారు.

సీఎం కేసీఆర్ వైద్య సదుపాయాలను ఎంతో పటిష్టం చేశారని, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే వంటి హాస్పిటళ్లను బలోపేతం చేశారని వెల్లడించారు. నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో 10వేల పడకలు సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వాళ్లకు ఇవే మంచి సమాధానమని మంత్రి చెప్పారు.

తెలంగాణలో 2014లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే 2022 నాటికి 46కు చేరుకున్నాయని, ఈ ఏడాదితో 55 అవుతాయని తెలిపారు. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తే 9 ఏండ్లల్లోనే 35 కాలేజీలు తెచ్చామన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా కాన్సర్‌ను డిటెక్ట్‌ చేయబోతున్నామని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -