ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని తెలిపారు. దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకులిచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.
విజయవాడ మధురానగర్ లోని 218 రేషన్ షాప్ లో ట్రయల్ రన్ నిర్వహణ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పరిశీలన చేపట్టారు. ఈపోస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా పనితీరు పరిశీలించారు నాదెండ్ల.
గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పేరుతో మాయ చేసింది.. గత ప్రభుత్వం వేల కోట్లు దుర్వినియోగం చేసింది.. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం అన్నారు. రైస్ స్మగ్లింగ్ లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఈకేవైసీ 96 శాతం పూర్తిచేశాం.. దేశంలోనే ఇది ఒక రికార్డు.. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అన్నారు.
జూన్ 1 నుంచి 4.40 లక్షల మందికి సరకులు ఇస్తున్నాం.. మార్కెట్‍లో ధరల పెరుగుదల ఉంటే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తాం.. అన్ని షాపులకు ఈ సాయంత్రానికి సరకులు చేరుతాయి.. ఈపోస్ మిషన్, కాటా, సర్వీసింగ్ ఉచితంగా చేయిస్తున్నాం.. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరకులు అందజేస్తాం.. 1 నుంచి 15 వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయి అని తెలిపారు.
Also Read:RBI:ఆర్బీఐ వార్షిక నివేదక

