ఏపీ రైతులకు శుభవార్త

10
- Advertisement -

రాష్ట్రంలో ధాన్యం రైతులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. సోమవారం నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి “7337359375” వాట్సాప్ నంబర్‌కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నారు.

2025–26 ఖరీఫ్ పంట సీజన్‌లో ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది అనుభవంతో ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలి… తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. తాడేపల్లిగూడెం ఆరుగొలను గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారు నాదెండ్ల మనోహర్.

Also Read:‘పెద్ది’..అచ్చియ్యమ్మగా జాన్వీ

- Advertisement -