ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

170
home
- Advertisement -

రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాతో ఏడాది పాటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కంపెనీల కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు.

అయితే ఇప్పటికీ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే వర్క్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ కూడా తన ఉద్యోగులను బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎయిర్‌బీఎన్‌బీ సంస్థలో పనిచేసేవారు ప్రపంచంలో ఏ మూలన ఉండైనా పనిచేసుకోవచ్చని స్పష్టంచేసింది. మీ శాలరీలపై ఈ విధానం ఎలాంటి ఎఫెక్ట్ చూపబోదని స్పష్టం చేసింది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తుంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలను అందిస్తుంది.

- Advertisement -