గోంగూర ఎక్కువగా తింటున్నారా?

96
- Advertisement -

గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఆకుకూరల్లో ఎక్కువ మంది ఇష్టపడేదిగా గోంగూరను చెప్పుకోవచ్చు. గోంగూరతో పప్పు లేదా పచ్చడి.. ఇంకా రకరకాలుగా వంటలు చేయవచ్చు. రుచిలో కాస్త పుల్లగా ఉండే గోంగూరను అధ్రుల అభిమాన వంటకంగా చెప్పుకోవచ్చు. అయితే గోంగూర కేవలం రుచి పరంగానే కాకుండా ఎన్నో పోషకాల సమ్మేళనం అని కూడా చెప్పుకోవచ్చు. గోంగూరలో విటమిన్ ఏ, సి తో పాటు రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, మరియు పీచు అధికంగా ఉంటుంది. ఇక గోంగూరలో వివిధ రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆయుర్వేదంలో కూడా గోంగూర ఆకులను మరియు, ఆకులలోని జిగురును, ఖండాన్ని కూడా ఔషధం నిమిత్తం వాడుతూ ఉంటారు. .

ఇక శరీరంపైన గడ్డలు లేదా వ్రణలు ఉన్నవాళ్ళు.. గోంగూర ఆకులను ఆముదంలో ముంచి వాటిపై పెట్టుకుంటే ఆ గడ్డలు ఈజీగా తగ్గిపోతాయి. ఇక బోదకాలు ఉన్నవారికి గోంగూర ధీవ్య ఔషధంలా పని చేస్తుంది. కొన్ని గోంగూర ఆకులను అలాగే కొన్ని వేప ఆకులను మెత్తగా నూరుకోని లేదా మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని బోదకాలు పై ప్రతిరోజూ పుసుకుంటే బోదకాలు తగ్గుముఖం పడుతుంది. ఇక తరచూ విరోచనలతో బడపడే వాళ్ళు గోంగూరతో చేసిన వంటకాలను తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గొంగూర ఆకులలోని జిగురు తీసి దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి సేవించడం వల్ల విరోచనలు తగ్గే అవకాశం ఉంది.

Also Read:నిఖిల్.. ‘స్వయంభూ’ అప్‌డేట్

ఇక దగ్గు ఆయాసం ఉన్నవాళ్ళు ప్రతిరోజూ గొంగూర తింటే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. గొంగూరలో ఉండే విటమిన్ ఏ మరియు సి కారణంగా వివిధ రకాల కళ్ల సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక గోంగూర ప్రతిరోజూ తినడం వల్ల గుండె లివర్ సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే గోంగూర ఎక్కువగా తినడం వల్ల అందులో అధికంగా ఉండే పీచు కారణంగా అజీర్తి, యాసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనాగని మితంగా తింటే ఆరోగ్యమే.. అమితంగా తింటే అనారోగ్యం తప్పదు.

- Advertisement -