ఆడబిడ్డల జోలికి వస్తే పతనం తప్పదు:సునీత

8
- Advertisement -

అందాల పోటీలకు వచ్చిన వారికి తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించారు అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గొంగిడి సునీత.. వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు… వాళ్ళతో అందాల పోటీలకు వచ్చిన వారి కాళ్ళు కడిగిస్తే మంచిగా ఉండేది అన్నారు.

ఓరుగల్లులో రాణిరుద్రమ దేవి,సమ్మక్క,సారలమ్మ అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి… మహిళా మంత్రులు కాళ్ళు కడిగి ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది అన్నారు. అందాల పోటీలకు వచ్చిన విశ్వ సుందరిలు చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడారు, బతుకమ్మ అంటే
తెలంగాణ ఆడబిడ్డలకు దేవత …రేవంత్ రెడ్డిది భస్మాసురహస్తం అన్నారు.

ఆడబిడ్డల జోలికి వస్తే రేవంత్ రెడ్డికి పతనం తప్పదు..సరస్వతి పుష్కరాల్లో రేవంత్ రెడ్డి దంపతుల కటౌట్ కింద అమ్మవారి ఫోటో ఏర్పాటు చేశారు..రేవంత్ రెడ్డికి ఎందుకు అహంకారం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను అవమానిస్తున్నారు…ఫార్ములా ఈ రేస్ తో 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నారు. 40 కోట్లు కేటీఆర్ ఖర్చుపెడితే కేసులు పెట్టారు.. 200 కోట్లతో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు.అందాల పోటీలతో తెలంగాణకు వచ్చే లాభం ఎంత…?..గతంలో ఇందిరాగాంధీని గురువాయుర్ డేవాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు అన్నారు.

తెలంగాణ సాంప్రదాయలను,పండుగలను అవమానిస్తున్న రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎందుకు మాట్లాడటంలేదు..రాజా సింగ్ ఎందుకు నోరు విప్పడం లేదు,జై శ్రీరామ్ ఒక్కటే కాదు దేవతల గురించి బీజేపీ నేతలు మాట్లాడాలి అన్నారు. బీజేపీ నేతలకు ఏమైనా చాక్లెట్స్ పంచిపెట్టారా…?, స్ట్రీట్ వెండర్స్ ను మెప్మా ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలి.. వరంగల్ జిల్లాలో విశ్వసుందరీలు పర్యటన చేస్తే స్ట్రీట్ వెండర్స్ దుకాణాలను కూల్చారు,తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..
రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తే సతీమణి,బిడ్డ శాపనార్థాలు పెట్టారు అన్నారు.

Also Read:సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్

అందాల పోటీలకు సాంప్రదాయ పద్ధతులు లేవు అన్నారు బీఆర్ఎస్ నేత పాల్వాయి స్రవంతి. ఆడవాళ్లు కాళ్ళు కడిగే సాంప్రదాయం తెలంగాణలో లేదు… అందాల పోటీలకు వచ్చిన సుందరీమణుల కాళ్ళు కడిగించడం తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం అన్నారు.

చౌమోహల్లా ప్యాలెస్ లో సుందరీమణులకు లంచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కు లక్ష రూపాయలు ఖర్చు చేసింది..తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మి పధకం ఎందుకు ఇవ్వడం లేదు చెప్పాలన్నారు.

- Advertisement -