సునీత నాకు కూతురితో స‌మానంః కేసీఆర్

225
aaleru
- Advertisement -

ఆలేరు టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గొంగిడి సునీత త‌నుకు కూతురితో స‌మానం అన్నారు సీఎం కేసీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నేడు ఆలేరులో నిర్వ‌హించిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌కు హాజ‌ర‌య్యారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఈసంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలేరు ప్ర‌జ‌లు చాలా చైత‌న్య‌వంతులు, పోరాటాల గ‌డ్డ ఆలేరు. ఈఎన్నిక‌ల్లో గెలిచేది నాయ‌కులు కాదు ప్ర‌జ‌లుల గెల‌వాల‌న్నారు. ప్ర‌జ‌లు ఏది కొరుకుంటారో అది జ‌రిగిన‌పుడే బంగారు తెలంగాణ సాధ్య‌మ‌న్నారు.

kcr

ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసి వ్య‌క్తి గొంగిడి సునీత అని అలాంటి వారిని మ‌నం గెలిపించుకోవాల‌ని ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. గ‌త 58ఏండ్లుగా రాష్ట్రంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ఒక వైపు, నాలుగున్నేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక వైపు ఉన్నాయ‌ని ఎవ‌రికి ఓటు వేస్తారో మీరే నిర్ణ‌యించుకొవాల‌న్నారు. రైతుల‌కు 24గంట‌లు క‌రెంట్ ఇచ్చిన ఘ‌న‌త టీఆర్ఎస్ పార్టీద‌న్నారు. గతంలో కరెంట్ ఎలా ఉండేదో..ఇపుడు ఎలా ఉందో మీకందరికీ తెలుసునన్నారు.

kcr

2001లో నేను ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో చిన్న పిల్లగా నా వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నది. మీరు దయతలిస్తే జెడ్పీటీసీగా, అన్ని హోదాల్లో పనిచేసింది. ఏ ఒక్కరోజు కూడా ఓడినా..గెలిచినా ఉద్యమ బాట వీడలేదు. అందుకే ఈసారి ఎన్నిక‌ల్లో సునీత‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.

- Advertisement -