16న ‘సోడా గోలీసోడా’..

338
golisoda movie releasing on feb16th...
- Advertisement -

ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పణలో మల్లూరి హరిబాబు దర్శకత్వంలో నిర్మాత భువనగిరి సత్య సింధూజ నిర్మించిన చిత్రం ‘సోడా గోలీసోడా’. మానస్, నిత్య నరేష్, కారుణ్య హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 16 న విడుదల కాబోతుంది.

golisoda movie releasing on feb16th...

ఈ సందర్భంగా నిర్మాత భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ…’పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని వర్గాలను ఆకర్షించే కంటెంట్ ఉంది. కమర్షియల్ విలువలతో.. ఎక్కడా వెనుకాడకుండా చిత్రాన్ని నిర్మించాము. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 16 న చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. ‘సోడా గోలీసోడా’ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము..’ అని అన్నారు.

- Advertisement -