- Advertisement -
పసిడి ధరలు కొండెక్కాయి. రికార్డు స్దాయిలో గరిష్ట ధరకు చేరుకున్నాయి బంగారం ధరలు. 10 గ్రాముల బంగారం దాదాపుగా రూ. 50 వేలకు చేరుకుంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 520 పెరిగి రూ.49,500 కి చేరగా… మరో రెండు రోజుల్లో ఈ ధర రూ.50 వేలు దాటిపోవచ్చు.
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి 45,370 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా రూ. 200 పెరిగి కిలో వెండి ధర రూ. 48,50కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపగా ఈ ఏడాది పసిడి ధర 50శాతంకి పైగా పెరగడం విశేషం.
- Advertisement -