పుంజుకుంటున్న బంగారం ధ‌ర‌లు..

222
gold
- Advertisement -

దేశంలో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పుంజుకుంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు త‌గ్గుతూ వ‌చ్చిన‌ బంగారం ధ‌ర‌లు గ‌త రెండుమూడు రోజుల నుంచి వ‌రుస‌గా పెరుగుతున్నాయి. 24 క్యారట్ బంగారం ఇవాళ ఏకంగా రూ.48 వేల మార్కును దాటింది. బంగారం ధ‌ర‌లు భ‌విష్య‌త్తులో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.120 పెరిగి… రూ.44,480కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.140 పెరిగి.. రూ.46,500కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.180 తగ్గి… రూ.45,980కి చేరింది.

వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో ధర 6 సార్లు తగ్గగా… 2 సార్లు పెరిగింది. రెండుసార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. అదే… 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.545.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే… ధర రూ.682 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,820 ఉండగా… కేజీ వెండి ధర… రూ.68,200 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో మార్పు రాలేదు. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన టైమే. ఎందుకంటే… జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,200 ఉంది. అంటే… ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.8,600 తగ్గింది. ఐతే… ఆగస్ట్ 8 నుంచి వెండి ధర పెరుగుతోంది. మున్ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -