- Advertisement -
కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పైపైకి కదులుతున్నాయి. ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 51,870కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 47,550కు చేరింది.
బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కేజీకి వెండి ధర రూ. 66 వేలుగా ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి రేటు పడిపోయింది. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.07 శాతం క్షీణించి 1848 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.54 శాతం దిగివచ్చింది. దీంతో సిల్వర్ రేటు 21.77 డాలర్లకు పడిపోయింది.
- Advertisement -