ఆల్‌టైం రికార్డుకి చేరువలో పసిడి

480
gold rate
- Advertisement -

బంగారం ధర పరుగులు పెడుతోంది. ఆల్ టైం రికార్డుకి చేరువలో 10 గ్రాముల బంగారం ధర రూ. 40 వేలు దాటింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.40,260 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,800గా ఉంది. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రూ.670లు పెరిగింది. దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.42వేలకు చేరే అవకాశముంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.48,165లుగా ఉంది.

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఆకాశానంటాయి. ఈ వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. నేటి ఉదయం డాలర్‌తో పోలిస్తే రూ.72.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి ఒక దశలో రూ.72.25కు చేరింది. గత ముగింపుతో పోలిస్తే ఇది 59పైసలు తక్కువ. 2019లో ఇంత స్థాయిలో రూపాయి ఎప్పుడు నష్టాలను చూడలేదు.

- Advertisement -