దిగొస్తున్న పసిడి..

99
- Advertisement -

దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.47,000కి చేరగా 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.230 తగ్గడంతో రూ.51,280కి చేరింది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.67 వేలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల రూ.47 వేలకు దిగిరాగా 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,280కు తగ్గింది. అయితే ఢిల్లీలో వెండి రేటు మాత్రం కేజీపై రూ.400 పెరగడంతో ధర రూ.62,700గా ఉంది.

- Advertisement -