పసిడి ప్రియులకు భారీ షాక్

11
- Advertisement -

పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గర పడుతున్న వేళ ధరల పెరుగుదల సామాన్యులపై భారంగా మారింది.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ మార్పిడిలో ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను మరింత పైకి నెట్టాయి. ఫలితంగా 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,090 పెరిగి ప్రస్తుతం రూ.1,43,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,000 పెరిగి రూ.1,31,650గా నమోదైంది. ఇక వెండి ధరలు బంగారాన్ని మించి దూసుకెళ్తున్నాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.15,000 పెరగడంతో ప్రస్తుతం రూ.3,07,000కు చేరింది. ఇంత భారీ పెరుగుదల గతంలో ఎప్పుడూ లేదని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆభరణాల కొనుగోలు మరింత తగ్గే అవకాశముందని అంచనా. మరోవైపు పెట్టుబడిదారులు మాత్రం బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read:దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -