- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.49,950కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.270 పెరిగి రూ.54,490గా ఉంది. ఢిల్లీలో తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ.250 పెరిగి రూ. 50,100గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగి రూ.54,640గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ.500 పెరిగి రేటు రూ.73 వేల మార్కుకు చేరింది. ఢిల్లీలో రూ.500 తగ్గి కిలోకు రూ.69000గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఔన్సుకు 1793 డాలర్ల వద్ద ట్రేడవుతోండగా సిల్వర్ ఔన్సుకు 23.22 డాలర్ల వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -