Gold Price:తులం రేటు ఎంతంటే

37
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. దేశీయంగా శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. తులం బంగారంపై రూ.600 వరకూ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 మేర పెరిగి రూ.56,650కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే తులంపై రూ.600 మేర పెరిగి 61,800కి చేరింది.

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధరపై రూ.1600 పెరిగి రూ. 79,600కు చేరుకుంది. వెండి ధర సైతం దాదాపు రూ.80 వేలకు చేరుకోవడం కలవరపెడుతోంది.

 అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2043.20 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.89 డాలర్లుగగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -