భారీగా పెరిగిన బంగారం ధరలు..

152
gold
- Advertisement -

ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. 18 రోజుల్లో బంగారం ధర రూ.3330 పెరగగా… వెండి ధర రూ.6400 పెరిగింది. బంగారం ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఇండియాలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. పైగా… 18 రోజులుగా బంగారం ధరలు పెరుగుతుంటే… ఇంకా పెరుగుతాయేమోనని నగలు కొనుక్కోవాలి అనుకునేవారు ఇప్పుడే కొనుక్కుంటున్నారు. దాంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి10 గ్రాములు రూ.44,160 ఉంది. నిన్న ధర రూ.10 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.35,328 ఉంది. నిన్న ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,416 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.48,170 ఉంది. నిన్న ధర రూ.10 పెరిగింది. తులం బంగారం ధర రూ.38,536 ఉంది. నిన్న ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,817 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

వెండి ధరలు కూడా కంటిన్యూగా పెరుగుతూ ఉన్నాయి. గత 18 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.6,400 పెరిగింది. నిన్న ధర స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.73,700 ఉంది. నిన్న ధరలో మార్పు లేదు. 8 గ్రాముల (తులం) కావాలంటే దాని ధర రూ.589.60 ఉంది. నిన్న ధర మారలేదు. ఒక్క గ్రాము వెండి ధర రూ.73.70 ఉంది. గత 6 నెలలతో పోల్చితే… అప్పుడప్పుడూ తగ్గుతూ ఉన్నా… ఓవరాల్‌గా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అక్టోబర్ 14న వెండి ధర కేజీ రూ.62,000 ఉంది. ఇప్పుడు రూ.73,700 ఉంది. అంటే రూ.11,700 పెరిగింది.

- Advertisement -