రికార్డు స్ధాయిలో బంగారం ధరలు

45
gold
- Advertisement -

బంగారం భగ్గుమంటోంది. రోజు రోజుకి ధరలు పెరుగుదలతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,000లు దాటిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఆల్‌టైమ్‌ హై రూ.61,360కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రూ.61,080కుచేరి సరికొత్త రికార్డు సృష్టించింది.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్స్‌కు ఒక్కరోజే రూ. 950 పెరిగింది. దీంతో ఇప్పుడు షాకింగ్‌కు గురిచేస్తూ రేటు రూ.56,250 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1030 మేర పుంజుకొని.. రూ.61,360 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దేశరాజధానిలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.950 పెరగ్గా.. రూ.56,400 మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1030 పెరిగి ప్రస్తుతం రూ.61,510 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -