పసిడి ప్రియులకు షాక్..

13
- Advertisement -

బంగారం ప్రియులకు షాక్‌. పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ఉదయం రూ.3,000 పెరిగి, రూ.1,01,350కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.2,750 పెరిగి, రూ.92,900గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,750 పెరిగి రూ.93,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.3,000 పెరిగి రూ.1,01,500గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.2,750 పెరిగి, రూ.92,900గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది. విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది.

Also Read:ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -