రాష్ట్రాలకు ఉచితంగా కరోనా టీకా…

283
covid 19
- Advertisement -

మే 1 నుండి 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ అందించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతుండగా పలు రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

కరోనా ఒక డోసును రూ.150కే తయారీ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్రానికి ఒక డోసుకు రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.600కు సరఫరా చేయనున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించగా దీనిపై కేంద్రం తీరుపై తీవ్ర వ్యతిరేకతరాగా స్పందించిన కేంద్రం కీలక ప్రకటన చేసింది.

- Advertisement -