43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..

330
godavari river
- Advertisement -

గోదారమ్మ శాంతించింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరి మూడో ప్రమాద కర స్ధాయిని మించి ప్రవహించడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులు వర్షాలకు గ్యాప్ రావడంతో గోదావరి ఉదృతి క్రమంగా తగ్గి 43 అడుగులకు చేరింది. నేటి నుంచి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించే అవకాశం ఉంది.

సోమవారి ఉదయం 6 గంటల వరకు గోదావరి వరద ఉదృతి 13 అడుగులు తగ్గి 43 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. నది ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాదస్థాయి హెచ్చరికను సైతం అధికారులు మరికొన్ని గంటల్లో ఉపసంహరించనున్నారు.

- Advertisement -